చాలా మంది ఎక్కువ రైలు ప్రయాణాలు చేస్తూ వుంటారు. మీరు కూడా ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ వుంటారా..? అయితే పక్కా మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. రైలు ప్రయాణాలు చేసేవాళ్ళు ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తారు. అయితే మీరూ అలా చేస్తూ ఉంటే ఈ విషయాలని తెలుసుకోవాలి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. “irctcconnect.apk” పేరుతో ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు బాగా షికార్లు కొడుతోంది. దాన్ని ఇన్‌స్టాల్ చేయకూడదని ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది.
పూర్తి వివరాలు చూస్తే.. వాట్సప్, టెలిగ్రామ్ లాంటి ఛాట్ యాప్స్‌లో ఇది వస్తోంది. ఈ ఏపీకే ఫైల్ ద్వారా యాప్ ఇన్‌స్టాల్ చెయ్యడం మంచిది. ఇది హానికరమైంది. ఇది మొబైల్ కి హాని కలిగిస్తుంది. అందుకే ఐఆర్‌సీటీసీ హెచ్చరిస్తోంది. అలానే ఐఆర్‌సీటీసీకి సంబంధించి వచ్చే మెయిల్స్‌కు రిప్లై ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు ఐఆర్‌సీటీసీ నుంచి మెయిల్స్ పంపుతున్నట్టు నమ్మించి మోసం చేస్తున్నారని.. ఐఆర్‌సీటీసీ అంటోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి యాప్స్ ని నమ్మకండి.
https://irctc.creditmobile.site పేరుతో ఓ ఫిషింగ్ సైట్ పేరు తో ఫిషింగ్ సైట్ ద్వారా ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ irctcconnect.apk పంపిస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సప్, టెలిగ్రామ్ లేదా ఇతర ఛాటింగ్ యాప్స్‌లో ఇలాంటి ఫైల్స్ వస్తే డౌన్లోడ్ చెయ్యకండి. ఏ యాప్ కావాలన్నా అధికారిక ప్లాట్‌ఫామ్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలానే ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్ నెంబర్, యూపీఐ, ఓటీపీ, పిన్ లాంటివి ఎవరితో కూడా పంచుకోకూడదు.