సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా…? అయినా సరే ఇలా లోన్ పొందొచ్చు..!

-

ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంతో ముఖ్యము. ఏ పని చేయాలన్నా సరే మొదట డబ్బు ఉండాలి. ఒక్కొక్కసారి మనం హౌస్ తీసుకోవాలన్న లేదంటే మరే కారణానికి అయినా లోన్ తీసుకుంటూ ఉంటాము. బ్యాంకుల నుండి లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ని చూస్తారు. సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే లోన్ రాదు కానీ నిజానికి సిబిల్ స్కోర్ తక్కువ వున్నా ఈ విధంగా లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ పొందే విసులుబాటు ఉంది బ్యాంకులో లేదా ఏ ఇతర ఆర్థిక సంస్థల నుండి అయినా కస్టమర్లకి లోన్లు ఇవ్వాలంటే ముందు క్రెడిట్ స్కోర్ చూస్తారు సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటే ఈజీగా లోన్ వచ్చేస్తుంది.

అందులో డౌట్ లేదు. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 900 దాకా ఉంటుంది 750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ పొందడం ఎంతో ఈజీ. 550 నుండి 750 దాకా ఉంటే పర్లేదు వీళ్ళకి కూడా లోన్స్ ఇస్తారు 500 కంటే తక్కువ ఉంటే మాత్రం లోన్ పొందడం కష్టం. మీ స్కోర్ కూడా తక్కువ ఉన్నట్లయితే ఇలా లోన్ తీసుకోవచ్చు మరి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు.

అందుకనే ప్రైవేటు బ్యాంకులు/ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు/ ఫిన్‌టెక్ సంస్థలను సంప్రదించడం మంచిది. సిబిల్ స్కోర్ తక్కువుగా ఉన్నా కూడా మీరు ఇలా లోన్ ని తీసుకోవచ్చు. గ్యారెంటర్ సహాయంతో కూడా క్రెడిట్ స్కోర్‌ తక్కువ ఉన్నప్పుడు లోన్ తీసుకోవచ్చు. అలానే ఆస్తిని తనఖా పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. హామీదారు వంటిది. క్రెడిట్ స్కోర్‌ తక్కువ ఉందని బ్యాంకు లోన్ ఇవ్వనంటే ఇలా బ్యాంకు నుండి లోన్ పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news