బాలీవుడ్ మత్తు కథా చిత్రంలో కొత్త మలుపులు…!

బాలీవుడ్ మత్తు కథా చిత్రం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంటిలో డ్రగ్స్‌ను పట్టుకుంది NCB. దీంతో బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది.!నటి దీపికా పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు NCB అధికారులు. ఆ తనిఖీల్లో కొద్ది మొత్తంలో చోరా, రెండు బాటిళ్ల లిక్విడ్ CNB దొరికినట్టు అధికారులు తెలిపారు. దీంతో కరిష్మా మరోసారి విచారణ కోసం కార్యాలయానికి పిలిపించారు.

తనిఖీలు జరిగిన సమయంలో కరిష్మా ప్రకాష్ ఇంట్లో లేరు. దీంతో విచారణకు హాజరుకావాలని ఇంటికే నోటీసులు అంటించారు అధికారులు. మరోవైపు.. కరిష్మా ఇరుగుపొరుగు, ఆఫీస్ బేరర్లు, పరిచయస్తులందరికీ సమన్లు జారీ చేసింది NCB. రహస్య సమాచారం ఆధారంగా చేపట్టిన తనిఖీల్లో 1.8 గ్రాముల చోరా, రెండు బాటిళ్ల లిక్విడ్ CNB దొరికినట్టు NCB అధికారులు తెలిపారు.

అంతకుముందు సెప్టెంబర్ 25న దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా NCB విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ ఇష్యూలో బయటకు వచ్చిన చాట్‌లో D అంటే దీపికా, K అంటే కరిష్మా అని గుర్తించారు అధికారులు. అప్పటి నుంచి వారిపై నిఘాను పెంచారు. ఆ నిఘాలో భాగంగానే కరిష్మా ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్టు తెలిసింది.