అక్కడబ్బాయ్ తో ఇక్కడమ్మాయ్ ప్రేమలో పడింది. ఇద్దరి వృత్తి ఒకటి కావడం మనసులు కలవడంతో వారి ప్రేమకు మతాలు..దూరాలు అడ్డురాలేదు. దాంతో ఇద్దరూ విశాఖ వేధికగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే….విశాఖపట్నంలోని మధురవాడకు చెందిన పిళ్లాశ్రీమన్నారయణ.. నిర్మల దంపతుల కుమార్తె చాముండేశ్వరి చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి హైదరాబాద్ లో డాక్టర్ గా సేవలు అందిస్తుంది. కాగా రాబర్ట్ చారల్స్ పవర్ అనే ఐర్లాండ్ కు చెందిన యువకుడు వైద్య పరిశోధనలు జరుపుతున్నాడు.

రాబర్ట్ హైదరబాద్ లో జరిగిన సమావేశానికి హాజరుకాగా అదే కార్యక్రమానికి చాముండేశ్వరి కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. దాంతో 2018లో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని నిశ్చయించుకున్నారు. 2019 లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక తాజాగా వీరి వివాహం విశాఖపట్నంలోని సాగర్ నగర్ బే లీఫ్ రిసార్ట్ లో గురువారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్యన జరిగింది. ఇక హిందూ సాంప్రదాయం ప్రకారమే వీరి పెళ్లి జరిగింది.