రక్తహీనత సమస్య నుండి ఇలా బయటపడండి…!

-

మన శరీరంలో విటమిన్లు, పోషక విలువలు తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. ఒంట్లో రక్తం తగ్గడం వల్ల చురుకుదనం తగ్గిపోయి నీరసంగా మారుతము. చిన్నపిల్లలు, మహిళల్లోనే రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. తాజా ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర, పాలకూర, మెంతికూర వంటి వాటిలో అధిక శాతం ఐరన్ ఉంటుంది. కనుక ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను తప్పని సరిగా తీసుకోవటం ఎంతో మంచిది.

ఆకుకూరల తో సలాడ్స్, కూరలు, పప్పు వంటివి చేసుకోవడంతో పాటు జ్యూస్ కూడా చేసుకొని తాగవచ్చు. పాలకూర జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత రాకుండా చేస్తుంది. వారంలో ఆరు రోజులు ఆకు కూరలు తినాలి అనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. ఇలా అయినా సరే ఆహారం లో మార్పులు తీసుకు రావచ్చు. ఆకు కూరలే కాకుండా జీడి పప్పు, బాదం పప్పు వంటి నట్స్ లో అధిక శాతం ఐరన్ ఉంటుంది.

కనుక వీటిని తప్పకుండా తినాలి. చీజ్ నుంచి బీ 12 లభిస్తుంది. పన్నీరు, పాలు, పాల ఉత్పత్తులు ఉపయోగించడం కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజు ముడి బియ్యం వాడడం ఎంతో అవసరం.
బీట్రూట్, క్యారెట్, ఉసిరి కలిపి జ్యూస్ చేసుకుని ప్రతి రోజూ ఉదయాన్నే తాగితే ఐరన్ పుష్కలంగా వస్తుంది. ఐరన్ శాతం సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. కనుక ఈ ఆహార పదార్ధాలని మీ డైట్ లో చేర్చి ఆరోగ్యంగా ఉండండి. రక్తహీనత సమస్య నుండి బయట పడండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version