మిమ్మల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారా..? కృంగిపోవడం కంటే ఉత్తమమైనది ఇదే..!

-

మనం మనకు ఏంటో తెలుస్తుంది కాని పక్క వాళ్ళకి మన గురించి తెలియదు. మన జీవితంలో మనం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాము… మన పరిస్థితులు ఏమిటి… ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనే వాటి గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు.

పైగా ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు హేళన చేస్తూనే ఉంటారు. ఏదో ఒక విషయం పట్టుకుని జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఇటువంటివి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే చాలా మంది ఇలా జడ్జ్ చేస్తున్నప్పుడు బాధపడుతూ.. కృంగిపోతూ ఉంటారు.

పైగా సమాజమంతా కూడా ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది. ఒకరు ఆనందంగా ఉంటే తట్టుకోలేరు. ఒకరు ఇబ్బందుల్లో ఉంటే పొడుస్తూ చులకన చేస్తూ ఉంటారు. పైగా కొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యులు కూడా జడ్జ్ చేస్తూ ఉంటారు. అయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎవరో ఒకరు దేని గురించి అయినా జడ్జ్ చేస్తూనే ఉంటారు.

మంచి చేసినా సరే జడ్జ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఇలా ఎదుర్కొంటున్నట్లు అయితే ఒక్క విషయాన్ని మీరు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటంటే ఇతరులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. మీరు అనుకోకుండా వాటిని చూసిన విన్న సరే వదిలేసేయండి.

భగవంతుడు ఇచ్చిన రెండు చెవుల్లో ఒక చెవితో విని మరో చెవితో వదిలెయ్యడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ సాటిస్ఫేక్షన్ కోసం మనం ఏదైనా చేయొచ్చు. దాని కోసం పక్క వాళ్ళతో పనిలేదు. మీ జీవితానికి మీరే హీరో. మీకు నచ్చినట్లు చేయండి.

మీ కెరియర్ కి సంబంధించి మీకు ఎలా అనుసరించాలని అనిపిస్తే అలా అనుసరించండి. అయితే మీరు ఫాలో అయ్యే పద్ధతులు మంచిగా ఉండేట్టు చూసుకోండి. అంతేకానీ పదేపదే ఇతరులు మిమ్మల్ని జడ్ చేస్తూ ఉంటే దాని గురించి క్రుంగిపోవద్దు. కేవలం వినేసి వదిలేయండి. అప్పుడే మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఏ బాధ కూడా ఉండదు అంతేకాని పదేపదే వాళ్లు వీళ్లు చెప్పింది విని బాధ పడి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకండి.

Read more RELATED
Recommended to you

Latest news