వేసవి కాలం వస్తుందంటే వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు శరీరాన్ని చల్లబర్చుకోవడానికి చల్లని నీళ్ళూ తాగుతారు. అలాగే చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, శరీరాన్ని వేడి చేసుకోవడానికి గోరు వెచ్చని నీళ్ళు తాగుతారు. ఐతే చాలామందికి ఏ నీళ్ళూ తాగాలన్న దానిపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. చల్లని నీళ్ళూ తాగొద్దని కొందరు, వేడినీళ్ళు మంచివి కావని కొందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా చల్లని నీళ్ళు తాగొద్దని చెప్పే వారిలో దానివల్ల లావు పెరుగుతారని నమ్ముతారు.
ఈ విషయమై పోషకాహార నిపుణులు ఏం చేబుతున్నారో ఒక్కసారి చూద్దాం. చల్లని నీళ్ళూ తాగితే లావు పెరుగుతారని అనుకోవడం ఒక అపోహా. ఇది అపోహా అని ఎందుకు అంటున్నారంటే నీళ్ళలో ఎలాంటి కేలరీలు ఉండవు. అయినా నమ్ముతున్నారంటే అది అపోహ అనే అంటున్నారు. నీళ్ళు చల్లవైనా, వేడివైనా వాటివల్ల లావు పెరగదని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే చల్లని నీళ్ళు తాగడం వల్ల లావు తగ్గుతారని వివరిస్తున్నారు.
తాగే నీళ్ళలో కేలరీలు ఉండవు కాబట్టి, లావు పెరగడం వంటి సమస్య ఉండదు. నీళ్ళు శరీర జీవక్రియను పెంచుతుంది. తద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తప్పకుండా తాగాలి. లేదంటే డీ హైడ్రేషన్, మూత్ర రాకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, చర్మం ఆరోగ్యంగా ఉండకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
నీళ్ళు సరిగ్గా తాగితే ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. మన శరీరానికి వచ్చే చాలా సమస్యల్లో నీళ్ళు తక్కువ తాగడం వస్తున్నాయనే విషయం అందరూ గుర్తించాలి. అందుకే శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తప్పకుండా తాగాలి.