సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు మొత్తం దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే కాకుండా జపాన్ లో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్థూ.. తన నటనతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ కాంటాక్ట్ అవుతూ వారికి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఇక అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ గా చలామణి అవ్వడానికి ఆయనే కారణమని చెబుతున్నారు. ఇంతకు ఎవరు ఆ ఆయన అనే విషయానికి వస్తే.. స్వర్గీయ నందమూరి తారకరామారావు అని చెప్పవచ్చు.
ఆంధ్ర అన్నగారుగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రాజకీయ పార్టీ ద్వారా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఇకపోతే ఎన్టీఆర్ సలహా వల్లే నేడు రజినీకాంత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఒకానొక సమయాల్లో రజినీకాంత్ , NTR కలిసి ఒక సినిమాలో నటించారు. ఇక రజనీకాంత్ కు విపరీతమైన కోపం ఉండేదట. ఆ కోపాన్ని తగ్గించుకోలేక రజినీకాంత్ తీవ్ర మనస్థాపానికి గురి అయ్యేవాడట. తోటి నటీనటులు పై రజనీకాంత్ విపరీతంగా కోపానికి గురి అవుతుంటే.. అతడిని చూసిన ఎన్టీఆర్.. విషయాన్ని తెలుసుకొని ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ప్రాణాయామం చేయాలి అని సలహా ఇచ్చారట.ఎన్టీఆర్ సహాయంతోనే తనలో ఉన్న కోపాన్ని తగ్గించుకుని తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సూపర్ స్టార్ హీరో గా చలామణి అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని రజినీకాంత్ మేజర్ జస్టిస్ సినిమా ఫంక్షన్ లో వెల్లడించారు. ఇక మొత్తానికి అయితే NTR సలహాతో రజినీకాంత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.