ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళ మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. రోజు ఏదో ఒక విషయంలో గొడవలు వస్తుంటాయి. అత్త తప్పని కోడలు, కోడలు తప్పని అత్త ఇలా వాదించుకుంటూ ఉంటారు ఇలాంటి పరిస్థితులు రాకుండా అత్తా కోడల బంధం బాగుండాలన్నా వారి మధ్య అనుబంధం పెరగాలన్నా ఈ మార్గాలని అనుసరించండి.
అప్పుడు కచ్చితంగా అత్తా కోడలు మధ్య ఇబ్బందులు రావు. ఆనందంగా ఉండొచ్చు. అయితే ఎంత బాగా ఉన్నా సరే అత్త తల్లి కాలేదు అలానే కోడలు కూతురు అవ్వలేదు. నూటికి 99 ఇళ్లల్లో అత్తా కోడళ్ల మధ్య సమస్యలు ఉంటుంటాయి. ఒక రోజుతో పోయేది కాదు సినిమాలా ఇది ముగిసిపోదు. సీరియల్ లాగ రోజూ సాగుతుంది.
అసలు గొడవలు ఎందుకు వస్తాయి..?
ఇంటి కట్టుబాట్లు సంప్రదాయాలు విషయాల వలన వస్తాయి. అలానే వీళ్ళకి నచ్చినది చేస్తుంటే అది వాళ్ళకి నచ్చకపోవచ్చు దీంతో సమస్యలు పెద్దవి అయిపోతాయి. అయితే అత్తా కోడలు మధ్య అనుబంధం మాత్రం బలపడితే గొడవలు రావు. పైగా ఆ ఇంట ఆనందం ఉంటుంది.
అత్త కోడల మంత్రి గొడవలు రాకూడదు అంటే తల్లి కూతుర్ల సంబంధం ఉన్నట్లు భావించాలి అప్పుడు సమస్యలు రావు.
కష్ట సుఖాలని ఒకరితో ఒకరు పంచుకోవాలి. అలానే పనులని కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి ఇలా చేస్తే గొడవలు ఉండవు.
అలానే ఇద్దరు కూడా ఒకరితో ఒకరు సమయాన్ని గడపండి. అప్పుడు వాళ్ళ మధ్య ఇబ్బందులు రావు.
అలానే ఏకాభిప్రాయంతో అత్త కోడలు నడుచుకుంటే గొడవలు ఉండవు.
అత్త కోడలికి అమ్మలా.. కోడలు అత్తని తల్లిగా భావిస్తే ఆ ఇంట సమస్యలు రావు ఇలా చిన్నచిన్నగా మీరే పరిష్కరించుకోండి అలానే చిన్న గొడవని కూడా సాగదీసుకుంటూ వెళితే ప్రమాదం మీకే. ఒకవేళ ఏదైనా గొడవ జరిగి ఇద్దరు వాదించుకున్నా మళ్లీ సర్దుకుపోవాలి మూడో మనిషిని మధ్యలో తీసుకురావద్దు.