నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చలి కాలంలో చాలా మంది తక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే వాతావరణం ఎలా ఉన్నా సరే ఒంటికి సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
అయితే కొంత మంది నీళ్లు తాగడం మంచిదని ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. అధికంగా నీళ్లు తాగడం వల్ల ఓవర్ హైడ్రేషన్ అవుతుంది. దీని వల్ల కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఓవర్ హైడ్రేషన్ సమస్యని ఎలా గుర్తించాలి..?, ఓవర్ హైడ్రేషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం పూర్తిగా చూసేయండి.
ఓవర్ హైడ్రేషన్ లక్షణాలు:
తలనొప్పి
అలసటగా ఉండడం
వికారం కలగడం
ఇరిటేషన్
మజిల్ వైబ్రేషన్స్
మజిల్ క్రాంప్స్
లూజ్ మోషన్స్
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే ఇబ్బందులు:
ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల హైపోనెట్రెమియా సమస్య వస్తుంది. బ్లడ్ లో సోడియం తగ్గిపోయినప్పుడు ఈ సమస్య వస్తుంది. ఓవర్ హైడ్రేషన్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలానే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఇంఫ్లమేషన్ సమస్య వస్తుంది. అలానే డయేరియా సమస్య కూడా ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎంత తాగాలో అంతే తాగండి. ఎక్కువ, తక్కువ తాగినా కూడా సమస్యలు వస్తాయని గుర్తించండి.