మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాండ్ల సంకీసకు చెందిన 8 మందికి కరోనా నిర్ధారణ అయింది. గ్రామానికి చెందిన 40 మంది అయ్యప్పస్వామి మాలదారులు ఇటీవల కేరళలోని శబరిమలకు దర్శనానికి వెళ్లి వచ్చారు. వారిలో కొంత మందికి జలుబు, జ్వరం రావడంతో డోర్నకల్‌లోని PHCలో టెస్టులు చేసుకోగా 8 మందికి కోవిడ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.