దిల్ రాజు ది ధైర్యమా తెగింపా ..?

-

నేచురల్ స్టార్ నాని 2019 లో జెర్సీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్నాడు. చెప్పాలంటే నాని కి మంచి హిట్ పడి చాలా కాలమే అయింది. ఎప్పటికప్పుడు కొత్త కథలని ఎంచుకుంటున్నా .. గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో ప్రయోగం చెస్తున్నా హిట్ దక్కడం లేదు. ఇక 2020 లో నాని తన 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో విలన్ గా నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. కాని ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.

 

ఇక నాని ఇప్పటికే ‘టక్ జగదీష్’ సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఇపటికే ఈ సినిమా కొంత టాకీ పార్ట్ కూడా షూటింగ్ జరుపుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చారు. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. అంతేకాదు టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించే సినిమాలో కూడా నాని నటించబోతున్నాడు.

 

అయితే ఇప్పుడు నాని సినిమా విషయంలో దిల్ రాజు గురించి ఆసక్తికరమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాని వి సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇక ఈ సినిమాను జూలై లో రిలీజ్ చేయడానికి సన్నాహాల్లో ఉన్నారు. అయితే ఇది నాని కి గాని దిల్ రాజు కి గాని రిస్క్ అవుతుందా అని కొంతమంది అనుకుంటున్నారట. లాక్ డౌన్ తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తే జనాలు థియోటర్స్ కి వస్తారా అన్నది అందరిలో ఉన్న పెద్ద సందేహం. అందులో క్లారిటీ లేకుండానే దిల్ రాజు వి సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి ఇది దిల్ రాజు కి ఉన్న ధైర్యమా లేదా తెగింపా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news