కళ్లకు ఐ మాస్క్‌ ధరించడం సేఫేనా..? అధ్యయనం ఏం తేల్చింది..?

-

నిద్రపోయేప్పుడు కళ్లకు మాస్క్‌ పెట్టుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. లైటింగ్‌ ఎక్కువగా ఉంటే నిద్రపట్టదని ఇలా పెట్టుకోని పడుకుంటారు. దీని వల్ల నిద్ర త్వరగానే పడుతుంది.. కళ్లకు అంతా డార్క్‌గా ఉండి.. త్వరగా నిద్రలోకి జారుకుంటారు. సైన్స్ మాత్రం ఐ మాస్క్ ధరించడం వల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని అంటుంది. దీనికి సంబంధించిన ఒక అధ్యయనాన్ని నిపుణులు ఉటంకిస్తున్నారు. వెలుతురు ఉండటం వల్ల నిద్రని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే పడుకునే గదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటారు.. అలా చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది.
Sleep Mode: Should You Be Wearing An Eye Mask To Bed? - Her Circle
ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. రాత్రి పూట నిద్రలో కంటికి మాస్క్ ధరించడం వల్ల కాంతిని నిరోధించడంతో పాటు జ్ఞాపకశక్తి, మెదడు చురుకుగా ఉంటుందని తేలింది. స్లీప్ మాస్క్‌లు ఎలా సహాయపడతాయో తెలుసుకోవడం కోసం పరిశోధకులు రెండు ప్రయోగాలు చేశారు. ఇవి ధరిస్తే నిద్రకు ఆటంకం కలుగుతుందా లేక కంటికి మేలు చేస్తుందా అని గమనించారు.

అధ్యయనం ఇలా చేశారు..

మొదటి ప్రయోగంలో 18-35 సంవత్సరాల వయస్సు కలిగిన 94 మందిని ప్రతి రోజు రాత్రిపుట నిద్రపోయే ముందు స్లీప్ మాస్క్ ధరించమని చెప్పారు. మరొకవారం వాళ్ళ కంటికి ఎటువంటి మాస్క్ పెట్టకుండా ఉంచారు. వీరిలో మెదడు పనితీరు బాగుండటాన్ని గుర్తించారు. మాస్క్ ఉపయోగించినప్పుడు మెదడు చురుకుగా పనిచేసిందని పరిశోధకులు తెలిపారు. ఇక రెండో ప్రయోగంలో మాస్క్ పెట్టుకోకుండా నిద్రపోయారు. ఇందులో ఒకే వయస్సు ఉన్న 35 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారి నిద్ర విధానం ఎలా ఉందనేది తెలుసుకునేందుకు ఒక డివైజ్ అమర్చారు.రెండో ప్రయోగంలో పాల్గొన్న వాళ్ళు నిద్రపోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. నిద్రపోయేటప్పుడు కళ్ళకు ముసుగు ధరించడం వల్ల మెదడు పనితీరుకు ప్రయోజనం చేకూరిందని పరిశోధకులు తెలిపారు.

స్లీప్ మాస్క్ వల్ల ప్రయోజనాలు

నిద్ర నాణ్యత పెరుగుతుంది. స్లీప్ మాస్క్ ఉండటం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.
కంటిలోకి ఎటువంటి కాంతి ప్రసరించకుండా ఇది అడ్డుకుంటుంది.
దీని వల్ల శరీరం మెలటోనిన్ స్థాయిని పెంచుతుంది.
ఇది శరీరాన్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది.
ఎటువంటి ఆటంకం లేకుండా మెలుకువ లేకుండా సాఫీగా నిద్రపోవచ్చు.
కాంతి ఎక్కువగా కళ్ళల్లో పడటం వల్ల మైగ్రేన్ తలనొప్పి అధికంగా ఇబ్బంది పెడుతుంది. ఈ ఇబ్బంది నుంచి బయట పడాలంటే కళ్ళకు మాస్క్ ఉంటే మంచిది.
ఇది పెట్టుకోవడం వల్ల చీకటిగా ఉంది నొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఇంకో వాదన కూడా ఉంది..

చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా కంటికి మాస్క్‌లు పెట్టుకుంటారు. హాట్ కంప్రెస్ ఐ మాస్క్‌లు సౌకర్యంగా అనిపించినప్పటికీ కళ్ళకి అది మంచిది కాదు. రాత్రిపూట కళ్ళు స్వేచ్చగా ఊపిరి పీల్చుకునేలా ఉండాలి. కానీ స్లీప్ మాస్క్ ధరించడం వల్ల ఆక్సిజన్ అందక కళ్ళు పొడిబారిపోవడం జరుగుతుంది. పూర్తిగా నిద్రలోకి వెళ్లాక మనం ఆ మాస్క్‌ తీసేస్తే.. ఎలాంటి సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news