ఎర్ర ఉల్లిపాయ: జుట్టు సంరక్షణకి మంచిదేనా?

-

మీ జుట్టు వదులుగా, మృదువుగా, పొడవుగా, మెరిసేలా ఉండేందుకు రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ మీకీ విషయం తెలుసా? మీ జుట్టుని అన్ని విధాలా కాపాడే అద్భుతమైన ఔషధం మీ వంటింట్లోనే ఉందని. అవును, మీరు విన్నది నిజమే. మీ జుట్టుని సంరక్షించే ఎర్ర ఉల్లిపాయ మీ ఇంట్లోనే దొరుకుతుంది. ఎర్ర ఉల్లిపాయతో జుటు మృదువుగా, బలంగా, చుండ్రు లేకుండా తయారవుతుంది. దీనిలో ఉండే అధిక శాతం సల్ఫర్ జుట్టుని బలంగా చేస్తుంది. ఇంకా యాంటీ బాక్టీరియల్ పదార్థాలు అన్ని విధాలా సాయపడతాయి.

Mixed Race woman tossing hair

ఎర్ర ఉల్లిపాయల వల్ల జుట్టుకి కలిగే ఉపయోగాలు

జుట్టు పెరగడం

జుట్టు పెరుగుదలకి అవసరమయ్యే పీహెచ్ వాల్యూని స్థిరంగా ఉంచుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల జుట్టు పెరగడం ఎక్కువగా ఉంటుంది.

జుట్టు ఊడిపోవడాన్ని నిరోధిస్తుంది

మన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం మొదలగు వాటివల్ల జుట్టు కుదుళ్ళు బలహీనంగా మారతాయి. దానివల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీన్ని నివారించడానికి ఎర్ర ఉల్లిపాయల నూనె వాడితే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటిఆక్సిడెంట్లు జుట్టు రాలకుండా కాపాడుతుంది.

మృదుత్వాన్ని పెంచుతుంది

పొడిబారడం, జుట్టు విఛ్చిన్నం అయిపోవడం మొదలగు సమస్యల నుండి ఉల్లిపాయ కాపాడుతుంది. దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి.

చుండ్రు, చిరాకు తగ్గించడం,

చుండ్రు వల్ల నెత్తి మీద కలిగే చిరాకుని పోగొట్టడంలో ఎర్ర ఉల్లిపాయలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. చుండ్రుని కలిగించే బాక్తీరియాలని నాశనం చేయడంలో ఎర్ర ఉల్లిపాయలు బాగా మేలు చేస్తాయి.

మెరిసే జుట్టు

ఎర్ర ఉల్లిపాయల కారణంగా జుట్టు మెరిసేలా తయారవుతుంది. శిరోజాలు బలంగా తయారై అందంగా కనిపిస్తుంది. అందుకే శిరోజాల అందానికి ఎర్ర ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది. మార్కెట్లో దొరికే చాలా ఉత్పత్తులను వాడి విసిగిపోతుంటే ఎర్ర ఉల్లిపాయలని ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news