అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారితో బాధపడుతున్న అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందోని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. ఇప్పటి వరకు యూఎస్‌లో పూర్తి స్థాయిలో కరోనా బాధితులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. టీకాలు వేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ముసుగు ధరించకుండా బయటకు తిరగవచ్చని పేర్కొంది. అయితే బయటకు వెళ్లినప్పుడు 6-8 అడుగుల దూరంలో నిలబడి కార్యకలాపాలు నిర్వర్తించుకోవాలన్నారు.
సీడీసీ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నామని చెప్పారు. అయితే టీకా వేస్తున్న ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వం ఆంక్షలు విధించిందన్నారు. వ్యాక్సినేషన్ అందరికీ చేయడం జరిగిందని, ప్రజలు కొన్ని ప్రాంతాల్లో మాస్కులు లేకుండానే తిరగవచ్చని తెలిపింది. అయితే మీరు బయటికి వెళ్లినప్పుడు మాత్రం సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని సీడీసీ ట్విట్టర్‌లో అధికారికంగా పేర్కొంది.
Fully vaccinated individuals can resume activities without wearing a mask or staying 6 feet apart: US Centers for Disease Control and Prevention (CDC)#COVID19 pic.twitter.com/b5Xo4H1AuQ
— ANI (@ANI) May 13, 2021
అమెరికాలో పెద్ద ఎత్తున టీకాలు వేసే కార్యక్రమం జరిగింది. దాదాపు అన్ని కేటగిరి ప్రజలకు టీకాలు వేయడం పూర్తయింది. ఇటీవలే చిన్నపిల్లలకు టీకాలు వేయొచ్చని ఆమోదం తెలిపింది. అయితే ఈ సక్సెస్ సాధించినందుకు దేశ అధ్యక్షుడు జో బైడెన్.. సీడీసీని ప్రశంసించారు. ఇప్పటివరకు టీకాలు వేసుకున్న ప్రజలు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు. ఇది ఒక పెద్ద విజయమని జో బైడెన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని చాలా మంది ప్రజలకు తక్కువ వ్యవధిలో టీకాలు వేసినందుకు సీడీసీని ఆయన ప్రశంసించారు. వీరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, అక్కడి ప్రజలు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన సూచించారు. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం మరిచిపోవద్దన్నారు.