టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..గతంలో అక్క, అత్త , వదిన పాత్రలు చేస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితమైంది.తన కూతురు సుప్రీతా తో కలిసి షేర్ చేసే ఫోటోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. మోడ్రన్ మామ్ ల హీరోయిన్ రేంజ్ లో ఎక్స్పోజ్ చేస్తూ కూతురితో సమానంగా.. కూతురు వయసుతో పోటీ పడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దగ్గరవుతున్నారు.
ఇకపోతే సురేఖ కూతురు సుప్రీతా కూడా రీల్స్, వీడియోలు చేస్తూ సినిమాల్లోకి రాకముందే సెలబ్రిటీ హోదా సంపాదించుకుంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట మరింత వైరల్ గా మారుతుంది. ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో సురేఖవాణి కూతురు సుప్రీత వివాహం చేసుకోబోతోంది అంటూ నేటిజన్ లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే తాజాగా జీతెలుగు వారు వాలెంటైన్స్ డే సందర్భంగా 2 ప్రేమ మేఘాలు అనే పేరిట ఒక షో చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ షో కి పలువురు సెలబ్రిటీ జంటలు వచ్చి సందడి చేశాయి. వీరితో పాటే సుప్రీతా కూడా ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో వచ్చి సందడి చేసింది. అంతేకాదు వారి పరిచయం, జర్నీ గురించి చెప్పడంతో ఇద్దరూ లవ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఇంస్టాగ్రామ్ లో వీరు తమ ఫోటోలను షేర్ చేస్తూ కింద లవ్ సింబల్ ను షేర్ చేయడంతో నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించక తప్పదు.
View this post on Instagram