సమంతను ఆ భయం వెంటాడుతోందా.. అందుకే పుష్ప 2 ఛాన్స్ మిస్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత రుతుప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అయితే మధ్యలో పెళ్లి , విడాకులు అంటూ కొంచెం కెరియర్ డిస్ట్రబ్ అయింది కానీ సమంత విడాకుల తర్వాత మళ్లీ తన సినీ కెరియర్ ముందుకు సాగేలా చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె విడాకుల తర్వాత మొదటిసారి నటించిన సినిమా పుష్ప ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించగా ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటీనటులుగా నటించారు.

ఈ సినిమాలో సమంత మొదటిసారి ఐటమ్ సాంగ్ చేసింది. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్ తోనే పాన్ ఇండియావ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకుందని చెప్పవచ్చు. ఈ పాట తర్వాత సమంతకు ఎన్ని అవకాశాలు వచ్చాయో అంతకుమించి కాంట్రవర్సీలు కూడా వచ్చాయి.. ఇకపోతే సమంత పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టుకోవడంతో బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వరించాయి.. ఈ క్రమంలోనే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేసుకుంటున్న సమయంలోనే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడ్డ సమంత ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకుంటూ తన తదుపరి సినిమాలో షూటింగ్లలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది.

సమంతకు పుష్ప 2 లో మరొకసారి అవకాశం ఇచ్చారట సుకుమార్.. కానీ సమంత ఆసక్తి చూపించలేదని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందని కూడా సమాచారం. అయితే సమంత రిజెక్ట్ చేయడానికి కారణం.. మరో ఐటమ్ సాంగ్ కూడా చేస్తే ఈమె సినిమాలను మర్చిపోయి కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారనే భయంతోనే సమంత ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సమంత తీసుకున్న నిర్ణయం ఒకరకంగా మంచిది అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news