రాధిక ఆ హీరో ని ప్రేమించి.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో ఒక హీరోను ప్రేమించి పెళ్లి చేసుకోలేకపోయింది. అందుకు సంబంధించిన వార్తలు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆయన ఎవరో కాదు తెలుగులో కామెడీ పాత్రలకు పెట్టింది పేరు సుధాకర్. తెలుగులో కమెడియన్ గా నటించినా.. తమిళ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంజిఆర్, శివాజీ గణేషన్ లాంటి హీరోలకు కూడా చుక్కలు చూపించిన స్టార్ హీరో అని చెప్పవచ్చు. అక్కడ పదుల సంఖ్యలో హీరో గా పనిచేసిన సుధాకర్ కొన్ని రాజకీయాల కారణంగా అక్కడ నిలదొక్కుకోలేక.. తిరిగి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇక ఎగిసి పడే కెరటంలా.. సినీ ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈయన.. చివరికి పతనమై చిన్న పాత్రలతో సరిపెట్టుకున్నాడు. సుమారుగా 45 చిత్రాలకు పైగా తమిళనాడు లో హీరోగా నటించిన ఈయన.. రాధిక తో సుమారుగా 18 సినిమాలలో కలిసి నటించారు. ముఖ్యంగా తమిళ్ సినీ ఇండస్ట్రీలో వీరిద్దరి జోడి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే మంచి నటిగా పేరు పొందిన రాధిక.. సుధాకర్ తో చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలను ఖండిస్తూ వారి స్పందించకపోవడం గమనార్హం. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. తర్వాత పెళ్లి మాత్రమే వాయిదా ఉంది అంటూ బలంగా తమిళనాడు ప్రేక్షకులు కూడా నమ్మారు.

ఇకపోతే సుధాకర్ చిన్న వయసులోనే తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదగడం.. అక్కడ హీరోలకు నచ్చలేదు. అంతేకాదు రాధిక, సుధాకర్ తో సన్నిహితంగా ఉండడాన్ని కూడా వారు ఓర్వలేకపోయారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య చిచ్చు పెట్టి విడదీశారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అందుకే సుధాకర్ కూడా తమిళ్ ఇండస్ట్రీని వదిలిపెట్టి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి, కామెడీ పాత్రలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news