పవన్ కళ్యాణ్ అత్త అనగానే మనకు అత్తారింటికి దారేది సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో అత్తగా సీరియస్ పాత్రలో, స్టైలిష్ గా చాలా బాగా ప్రేక్షకులను అలరించింది . నిజానికి పవన్ కళ్యాణ్ కి అత్త అంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.కానీ ఆ పాత్రలో చాలా అద్భుతంగా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్టైలిష్, మోడ్రన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా మారిన నదియా ఎక్కువగా హీరో హీరోయిన్లకు అత్తగా, తల్లిగా నటించి మంచి ఇమేజ్ ను తన సొంతం చేసుకుంది. ఇక తెలుగు స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ గా నటించిన నదియా ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇకపోతే సినిమాలో ఎంతో సీరియస్ గా కనిపించే నదియాకు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా ఉంది అంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇకపోతే నదియా ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంటికి ఎదురుగా ఉండే శిరీష్ గాడ్బోలే తో పరిచయం ఏర్పడింది. ఇక అతడి పరిచయంతో ఆమె పూర్తిగా తనని తాను మార్చుకున్నదట. ఇక ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అయితే శిరీష్ లక్ష్యం మాత్రం చదువు పూర్తిచేసి విదేశాల్లో స్థిరపడాలి. అందుకోసం నదియా తన సినిమా కలని కూడా త్యాగం చేసింది. ఇక శిరీష్ ఉద్యోగంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నదియా ఆలోచించింది. ఇక శిరీష్ అమెరికా వెళ్ళాక నదియా ఇండియాలో హీరోయిన్ గా బిజీ అయ్యారట.
ఇకపోతే గతంలో విదేశాలలో ఉన్న వారితో మాట్లాడాలి అంటే ఇప్పటిలాగా సోషల్ మీడియా, సెల్ ఫోన్ లాంటి సౌకర్యాలు పెద్దగా లేవు.. ఇక టెలిగ్రామ్ రాయడం లేదంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకోవడం లాంటివి చేయాలి. షూటింగ్ వల్ల ఆయనతో మాట్లాడటం నదియాకు కుదిరేది కాదు అట. ఫైనల్ గా శిరీష్ కి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఇంట్లో పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించారు. ఇక అలా1988లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.