అతిగా ఆవలింతలు వస్తున్నాయా..? జర పైలం..!

-

నిద్రముంచుకొచ్చినప్పుడు.. ఆవిలింతలు వస్తాయి.. ఆవిలింత ఒక అంటువ్యాధి.. పక్కన వాళ్లు ఆవిలిస్తే.. వెంటనే మనం కూడా అనేస్తాం.. అయితే ఒక వ్యక్తి జీవితం మొత్తంలో.. 2లక్షల 40 వేల సార్లు ఆవిలిస్తాడని అంచనా..! అయితే కొంతమందికి పదే పదే ఆవిలింతలు వస్తాయి.. మరి ఇలా జరగటం ఏమైనా అనారోగ్య లక్షణమా.. పరిశోధకులు ఏం అంటున్నారో చూద్దాం..

అధికంగా ఆవలింతలు ఎందుకు వస్తాయి?

సాధారణంగా నిద్రపోయే ముందు లేదా అలసటగా అనిపించినపుడు ఆవలింత వస్తుందని మనకు తెలిసిన విషయమే. పనిచేయాలని అనిపించక పోయినా నీరసంగా పని చేస్తున్నప్పుడు, విసుగు చెంది అలసిపోయినప్పుడు ఆవులింతలు వస్తాయి.. అయితే అప్పుడప్పుడు ఆవలించడం అలాగే తరచుగా ఆవులించడం మధ్య చాలా తేడా ఉంది. ఒకవేళ మీరు రోజులో చాలాసార్లు ఆవులిస్తూ ఉంటే, అది కేవలం అలసట మాత్రమే కాదు..మరేదైనా అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చునని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.
మగతగా ఉండటం, మీకు విసుగు అనిపించడం లేదా అలసటగా ఉండటం.
నిద్ర లేమి, గురక, స్లీప్ అప్నియా లేదా నార్కోలెప్సీ వంటి నిద్ర రుగ్మతలు ఉండటం.
దీర్ఘకాలికమైన ఒత్తిడి, ఆందోళనను అనుభవించడం
కొన్ని మందుల దుష్ప్రభావాలు, మోతాదు ఎక్కువగా తీసుకోవడం..
డీహైడ్రేషన్‌కు గురైనా అతిగా ఆవిలింతలు వస్తాయి..
నీరసం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు కూడా ఆవలింతలను కలిగిస్తాయి.
ఆస్తమా లేదా మరేవైనా ఇతర శ్వాసకోశ సమస్యలు ఉండటం.
స్ట్రోక్ అనుభవించిన వ్యక్తులు, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కాలేయ వైఫల్యం, మూర్ఛ లేదా నాడీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఆవులించడం జరుగుతుంది.

ఆవలింతలను తగ్గించటానికి కొన్ని మార్గాలు..

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.. ధ్యానం సాధన చేయవచ్చు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. ప్రతిరోజూ ప్రాణాయామం లేదా నడక, జాగింగ్ వంటివి చేయాలి.
సరిగ్గా నిద్రపోవాలి, క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్ కలిగి ఉండాలి. ప్రతీ వ్యక్తి 7-8 గంటల రాత్రి నిద్రను తీసుకోవాలి.
మధ్యాహ్నం వేళలో, సెలవులలో అతిగా నిద్రపోవడం నివారించాలి. ఎందుకంటే ఇది మీ స్లీపింగ్‌ సైకిల్‌పై ప్రభావం చూపుతుంది.
పడుకునే ముందు కెఫీన్, ఆల్కహాల్ పానీయాలు తీసుకోవడం, అతిగా తినడం మానేయండి…
మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటే ముందు అది మానేయండి.. వీటివల్ల చాలా సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news