నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.. కుప్పంలో జనవరి 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభ సమయంలో గుండెపోటుకు గురైన ఆయనను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి జనవరి 28న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి ప్రత్యేక విదేశీ వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది. అయితే . తారకరత్నకు గుండెపోటు రావడం వల్ల మిగతా శరీర అవయవాలు కూడా పనిచేయకుండా పోయాయి మెదడు సైతం తీవ్రంగా దెబ్బతినింది.
ఈ క్రమంలోని విదేశీ ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ వచ్చింది. చివరిగా ఆయనకు మెదడుకు శనివారము స్కాన్ చేయగా ఆయన మెదడులో ఎటువంటి మార్పు లేదు అని.. కోమాలో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు.. అయితే శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో హైదరాబాద్కి తరలించాలని కుటుంబ సభ్యులతో వైద్య బృందం చర్చించింది . ఇంతలోపే ఆయన మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
అయితే నందమూరి తారకరత్న మరణించడానికి కారణం మొదటి రోజు చేసిన తప్పే అని తెలుస్తోంది సాధారణంగా గుండెపోటు వచ్చిన వారికి నిమిషాల వ్యవధిలో సీపీఆర్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ తారకరత్న విషయంలో 45 నిమిషాల తర్వాత సిపిఆర్ జరిగింది అప్పటికే సీపీఆర్ అందాల్సిన టైంలో కాకుండా లేటుగా చేయడం వల్లే దానివల్ల హార్ట్ హోల్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి.. బ్రెయిన్ కి సప్లై ఆగిపోవడంవల్లే తారకరత్న పరిస్థితి ఇంత విషమంగా మారింది. సరైన సమయానికి చికిత్స అంది ఉంటే ఆయన నిజంగా బ్రతికి ఉండేవారు అనే సందేహం కూడా ఇప్పుడు అభిమానులలో మొదలైంది.
ఏది ఏమైనా తారకరత్న మరణించాడు అని తెలిసి అటు సినీ ఇండస్ట్రీ.. కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు , ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నందమూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.