కృష్ణ గారి స్థలం అమ్మి అప్పులు తీర్చిన చిరంజీవి అందుకేనా..?

-

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా అంతకుమించి దానధర్మాలలో మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కష్టం వచ్చిన ప్రతివారిని ఆదుకునేందుకు ముందు నిలబడతారు చిరంజీవి. అందుకే కరోనా సమయంలో కూడా ఎంతోమంది కష్టాలను తీర్చిన గొప్ప దానకర్త అని చెప్పవచ్చు. కేవలం సినీ కార్మికులకు మాత్రమే కాదు ఎవరికైనా కష్టం వచ్చింది అంటే ఆర్థిక సహాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడడు. అందుకే చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు తారస్థాయికి చేరుకుంటూ ఉంటాయి. అయితే ఇలా ఎంతోమందికి ఆర్థిక సహాయం చేసిన చిరంజీవి.. ఒకానొక సమయంలో కృష్ణ గారు అమ్మిన స్థలాన్ని కూడా చిరంజీవి అప్పులు తీర్చుకోవడానికి అమ్ముకున్నారనే వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

అసలు విషయంలోకెళితే చెన్నైలో ఫిలిం ఇండస్ట్రీ ఉండడం వల్ల మొదట స్టూడియోలన్నీ కూడా అక్కడే ఉండేవి.. అలా చాలామంది తెలుగు నటులు కూడా అక్కడే ఆస్తులను కొనుగోలు చేసి కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉండిపోగా.. మరి కొంతమంది హైదరాబాద్ వచ్చేశారుఅలా సూపర్ స్టార్ కృష్ణ కూడా అరుణాచలం గార్డెన్స్ పక్కన చెన్నైలో ఒక ఐదు ఎకరాలు స్థలం తీసుకొని కృష్ణ గార్డెన్స్ గా నామకరణం చేసి షూటింగ్లకు పనికి వచ్చే విధంగా డెవలప్ చేశారు.ఇక అలా ఆ గార్డెన్స్ లో వచ్చిన మొదటి సినిమా ఈనాడు. ఈ సినిమా కోసం మురికివాడకు సంబంధించిన సెట్స్ వేశారు . ఇక ఆ తర్వాత ఇతర హీరోల సినిమాలో షూటింగ్స్ కూడా కృష్ణ గార్డెన్స్ లో జరిగేవి. ఇందులో ఒక ఎకరా చిరంజీవి కొనుగోలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి విలీనం చేసేశారు. అయితే ఇదంతా తెలిసిన కథ అయినప్పటికీ ఆ సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారట చిరంజీవి . అందుకోసం అప్పు కూడా చేశారట.

అప్పు తీర్చడానికి చెన్నైలో ఉన్న కృష్ణ గార్డెన్స్ లోని ఎకరా స్థలం కూడా అమ్మేశారు అని, దాంతో వచ్చిన రూ. 25 కోట్ల డబ్బును అప్పులు తీర్చడానికి వినియోగించారని సమాచారం. ఇక ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడైన ఎన్ వి ప్రసాద్ తెలిపారు. ఇక కృష్ణ గార్డెన్స్ లోని 4 ఎకరాల్లో పద్మాలయ వారు డెవలప్మెంట్ కు ఇచ్చేశారు. ప్రస్తుతం అక్కడ అరుణాచలం స్టూడియో కూడా లేదు. కేవలం అక్కడ ఒక అపార్ట్మెంట్ మాత్రమే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news