ఇకనైనా విశ్వక్ సేన్ ఫేట్ మారబోతోందా..?

-

యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తన స్వీయ దర్శకత్వంలోనే సినిమాలు తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల అనేక వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల క్రితం హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ దేవీ నాగవల్లితో గొడవ పెట్టుకుని .. ఒక్కసారిగా వివాదాల్లోకి వచ్చిన ఈయన అర్జున్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా విషయంలో కూడా వివాదంలో చిక్కుకున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి ముందు విశ్వక్ సేన్ తప్పుకున్నట్టుగా వార్తలు తెరమీదకి వచ్చాయి.. తరువాత అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి జరిగిన విషయం ఏంటో చెప్పి.. విశ్వక్ సేన్ బాధ్యత రాహిత్యం వల్లే సినిమా ఆపేస్తున్నామని తెలిపాడు.

ఇదిలా ఉండగా ఇప్పుడు విశ్వక్ సేన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈయన మరొక సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పలాస దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా చేసే అవకాశం ఉందనే వార్త కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.ఇప్పటికే పలాస సినిమాతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చిన డైరెక్టర్ కరుణకుమార్ ఆ తర్వాత కళాపురం అనే ఒక సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే తారాగణం అంతా చిన్నవారే కావడంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు.

అయితే తాజాగా ఒక కథ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఈ సినిమాను హీరో విశ్వక్ సేన్ తో చేయించాలని వారు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా విజయం సాధిస్తే విశ్వక్ సేన్ ఫేట్ మారిపోయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news