టెర్రర్ డేంజర్.. ఇండియాలో ఐసిస్ విస్తరణపై ఎన్ఐఏ కీలక పరిశోధనలు..

ఆల్ ఖాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్ అంతమయ్యాక ఉగ్రవాదం కనబడకుండా పోతుందని చాలామంది భావించారు. కానీ అనతి కాలంలోనే ఇస్లామిక్ స్టేట్ రూపంలో ఉగ్రవాదం మరోమారు పడగ విప్పింది. ప్రస్తుతం ఈ సంస్థ తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇస్లామిక్ స్టేట్ పరిధి రోజు రోజుకీ పెరుగుతుందని, చాప కింద నీరులా అంతకంతకూ పెరుగుతుందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జరిపిన పరిశోధనలో పేర్కొంది.

ఇస్లామిక్ స్టేట్ మూలాలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన ఎన్ఐఏ, షాక్ ఇచ్చే నివేదికను అందజేసింది. ఉగ్రవాద సంస్థ భారతదేశంలో విస్తరించాలని చూస్తుందని, సోషల్ మీడియా ద్వారా తమ భావజాలాన్ని వ్యాప్తి చేయాలని చూస్తున్నారని, అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాద కదలికలు ఎక్కడ జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించింది.