రామ్, పూరి, ఛార్మీ ఇస్మార్ట్ భ‌జ‌న‌ !

-

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఇస్మార్ట్ శంక‌ర్` ఈనెల 18న రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్లాప్ ల్లో ఉన్న రామ్-పూరి ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని చూస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇప్ప‌టికే ఉంది. ఈ నేప‌థ్యంలో గురువారం తొలి కాపీ చూసిన అనంత‌రం రామ్ ట్విట‌ర్ వేదిక‌గా సినిమాపై త‌న అభిప్రాయాన్ని షేర్ చేసాడు. ఇస్మార్ట్ శంక‌ర్ చూసా. చూస్తున్నంత సేపు క‌ళ్లు అర్ప‌కుండా కంటున్యూగా చూస్తూనే ఉన్నా. కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నా. ఏ సినిమా ఈ స్థాయిలో కిక్ ఇవ్వ‌లేదు. థాంక్యూ పూరి జ‌గ‌న్నాత్ గారు. చాలా మంది తెలుసుకోలేని విష‌యం ఏంటంటే? మ‌ఈరొక డ్ర‌గ్ అంతే అన్నాడు రామ్.

ismart shankar promotion

దానికి పూరి స్పందిస్తూ డ్ర‌గ్ అనేది నిజంగా పెద్ద ప్ర‌శంస‌. నీ వ‌ల్లే నాకు ఆ కిక్క్ వ‌చ్చింది. అంతా నీ ఎన‌ర్జీ మ‌హిమ‌. దాని వ‌ల్ల ఇస్మార్ట్ శంక‌ర్ కి కిక్ ఇచ్చేలా ఉంది. సినిమా పూర్తియిన త‌ర్వాత నువ్వు ఇచ్చిన హ‌గ్ ఎప్ప‌టికీ మర్చిపోలేను. నువ్వొక అద్భుతం అంతే అన్నాడు. ఆ వెంట‌నే ఛార్మీ ట్విట‌ర్లోకి వ‌చ్చింది. ఫైన‌ల్ కాపీ చూసిన త‌ర్వాత మా న‌మ్మ‌కం రెండిత‌లైంది. శంక‌ర్ ఐ ల‌వ్యూ. ఇస్మార్ట్ శంక‌ర్ రాకింగ్. అభిమానుల్లారా జులై 18న ఫుల్ మీల్స్ కు సిద్దం కండి. అంతేకాదు ఆ త‌ర్వాత డ‌బుల్ ఇస్మార్ట్ కూడా వ‌స్తుంది. ఇదే నా ప్రామిస్. రామ్ నువ్వు తురుమ్ రా అంటూ పొగిడేసింది.

ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌ర్వాత ఒక‌రు సినిమా గురించి బూస్టింగ్ ఇచ్చే కార్య‌క్ర‌మం చూసి ఇదేదో భ‌జ‌న‌లా ఉందంటూ నేటి జ‌నులు సెటైర్లు షురూ చేసారు. మీ సినిమా ఎంత ఇస్మార్ట్ గా ఉంటుందో జులైన 18న ప్రేక్ష‌కులు తేల్చేస్తారు! అప్పుడు మాట్లాడుకుందాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఛార్మీ మ‌రీ ఓవ‌ర్ గా డ‌బుల్ ఇస్మార్ట్ కు రెడీ కండి అంటూ చేసిన కామెంట్ చూసి కాన్పిడెన్సా? ఓవ‌ర్ కాన్పిడెన్సా !అంటూ జోకులు పేల్తున్నాయ్. అయితే ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ముగ్గురి న‌మ్మ‌కం నిజ‌మ‌వ్వాల‌ని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news