ఈ పథకానికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం జగనే కావడంతో ఆ పథకానికి వైఎస్ జగన్ పేరును పెట్టారు. దానికి జగనన్న అమ్మ ఒడి పథకం అని పేరు పెట్టారు. ఈ పథకానికి 6455.80 కోట్లు కేటాయించారు.
ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇవాళ ఏపీ శాసనసభలో ఏపీ బడ్జెట్ 2019 ను ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా పలు రంగాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. అయితే.. దాదాపు అన్ని పథకాలు దివంగత ముఖ్యమంతి వైఎస్సార్ పేరు మీదనే ఉన్నప్పటికీ.. ఒక్క పథకాన్ని మాత్రం ఏపీ సీఎం జగన్ పేరు మీద ప్రవేశపెట్టారు.
ఈ పథకానికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం జగనే కావడంతో ఆ పథకానికి వైఎస్ జగన్ పేరును పెట్టారు. దానికి జగనన్న అమ్మ ఒడి పథకం అని పేరు పెట్టారు. ఈ పథకానికి 6455.80 కోట్లు కేటాయించారు.
దీనిలో భాగంగా… పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు 1500 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 1077 కోట్లు, వైఎస్సార్ పాఠశాలల నిర్వహణ గ్రాంటు కోసం 160 కోట్లు, అక్షమ పాత్ర ఫౌండేషన్ వంటశాలల నిర్మాణానికి 100 కోట్లు కేటాయించారు.