“ఇజ్రాయెల్ – హమాస్” యుద్ధంలో 4 వేల మంది మృతి !

-

ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా హమాస్ ఉగ్రవాద మిలిటెంట్ల మధ్యన ఘోరమైన యుద్ధం జరుగుతోంది. మొదట హమాస్ మిలిటెంట్లు విచక్షణారహితంగా ఇజ్రాయెల్ పై దాడి చేసి మారణహోమం సృష్టించగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార జ్వాలాతో రగిలిపోతూ అంతకంతకూ బదులు తీర్చుకుంటోంది. హమాస్ చేసిన దాడిలో భాగంగా ఇజ్రాయెల్ కు చెందిన వారు 1400 మంది మరణించారు. కానీ తాజాగా ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న ఎదురుదాడిలో 2670 మంది మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అలా ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 4 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. ఇంకా దగ్గర దగ్గర 10 వేల మంది పాలస్తీనాకు చెందిన వారు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడికి ముందుగానే ఇజ్రాయెల్ ఉత్తర గాజాను ఖాళీ చెయ్యాలని హెచ్చరించిన నేపథ్యంలో దాదాపుగా 10 లక్షల మంది వెళ్లిపోయారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇంకెన్ని వేల మంది ప్రజల ప్రాణాలు పోతాయో తలుచుకుంటేనే గుండె బరువెక్కిపోతోంది.

ఈ యుద్దాన్ని ఆపడానికి ప్రపంచంలోని మిగతా దేశాలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాయి అన్నది తెలియడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news