నిర్మాత మరియు డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫలితంతో సంబంధం లేకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆర్జీవీది. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నారు.

అయితే, వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్న డైరెక్టర్ ఆర్జీవి తాజాగా ఆ చిత్రంలోని సాంగ్ ను విడుదల చేశారు. ‘వైఎస్ఆర్సిపి… వైయస్సార్సీపి… ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు’ అంటూ సాగే ఈ పాటను ఆస్కార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా… వైయస్ భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ నవంబర్ 10న విడుదల కానుంది.