మే 7 నుంచి హైదరాబాద్ లో ఐటి కంపెనీలు రీఓపెన్…!

-

ఇప్పుడు లాక్ డౌన్ లో వేలాది కంపెనీలు ఆర్ధిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అందులో ప్రధానం గా చెప్పేది ఐటి కంపెనీలు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం ముఖ్యంగా ఐటి కంపెనీ ఎక్కువగా ఉండే అమెరికాలో కరోనా తీవ్రత ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో ఐటి కంపెనీలు చాలా వరకు మూతపడే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ ని కూడా కేంద్రం పెంచే సూచనలు ఉన్నాయి.

ఎక్కువ రోజుల పాటు వర్క్ ఫ్రం హోం ని ఇవ్వడం కూడా సాధ్యం అయ్యే పని కాదు. చాలా కంపెనీలు ఇలా ఇవ్వలేక ఉద్యోగులను కూడా విధుల నుంచి తప్పించాయి. ఇప్పుడు దేశంలో కరోనా తీవ్రత ఆధారంగా కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాలను కేంద్రం మూడు జోన్లగా విభజించింది. ఇందులో రెడ్ జోన్ లో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ ఉండగా ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ లో ఆంక్షలను సడలించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ లో మే 7 తర్వాత రీఓపెనింగ్ కి ఐటి కంపెనీలు సిద్దమవుతున్నాయి. ఇందులో చిన్న చిన్న కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంస్థలు మెయిల్స్ కూడా చేసాయి. విధులకు రావడానికి సిద్దంగా ఉండాలి అని సూచనలు చేసాయి. ఇందులో ప్రధానంగా సామాజిక దూరం పాటించి సంస్థలను నడిపే అవకాశం ఉంది. ఉద్యోగులు నివసించే జోన్ ల ఆధారంగా, వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని రవాణా సౌకర్యాలను కల్పిస్తాయి కంపెనీలు.

Read more RELATED
Recommended to you

Latest news