ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన ఐటి శాఖ… త్వరలో మంత్రులు కూడా…? తెలంగాణ భవన్ లో ఉక్కపోత…!

-

తెలంగాణాలో మేఘా కృష్ణా రెడ్డితో మొదలైన ఐటి దాడులు… ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి ఎమ్మెల్యేల వరకు పాకాయి. బుధవారం ఉదయం అగ్రనిర్మాత సురేష్ బాబుని లక్ష్యంగా చేసుకుని ఐటి బృందాలు దాడులు చేశాయి. పది బృందాలుగా విడిపోయిన అధికారులు పది ప్రదేశాల్లో దాడులు ఏకకాలంలో నిర్వహించారు. రాష్ట్ర పోలీసులకు ఏ విధమైన ముందస్తు సమాచారం లేకుండా ఈ దాడులు జరిగాయని సమాచారం. అలాగే హీరో నాని ఇంటి మీద కూడా ఐటి శాఖ దృష్టి పెట్టి దాడులు చేసి ఆయన నివాసంలో సోదాలు చేసింది.

సాయంత్రానికి సీన్ ఎమ్మెల్యే గారి ఇంటి మీదకు మారింది. కూకట్పల్లి తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఇంటిపై ఐటి దాడులు జరిగాయి. ఈ వార్త ముందు మీడియాలో వచ్చినట్టే వచ్చి మాయమైంది… దీనితో కాసేపు ఈ వార్త నిజమా కాదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు పలువురు. ఆ తర్వాత కొన్ని చానెల్స్ లో రావడంతో నిజమే అనుకున్నారు. ఆయన కుమారుడు సందీప్ రావు డైరెక్టర్ గా ఉన్న ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఐటి శాఖ దాడులు చేసింది… సంస్థ ఎండీ నరేంద్రతో పాటుగా… ఐదుగురు డైరెక్టర్ల ఇంటిపై ఏక కాలంలో దాడులు చేసింది ఐటి శాఖ…

ఇప్పుడు ఇది తెరాస లో కలవరానికి కారణంగా మారింది. అసలు మేఘా కృష్ణా రెడ్డి టూ తెరాస ఎమ్మెల్యేలు… వయా సినీ పరిశ్రమ… అసలు ఏం జరుగుతుందో అర్ధం కాక కొందరు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే సమయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల మీద ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని, వారిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారనే ప్రచారం బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో జరిగినా వాస్తవ పరిస్థితులు మాత్రం ఆ విధంగానే ఉన్నాయి అనేది కొందరి మాట. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి… ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ భవన్ లో ఉక్కపోత ఎక్కువైంది అనే కబురు వినపడుతుంది…!

Read more RELATED
Recommended to you

Latest news