గుడ్ న్యూస్‌: స‌్వ‌ల్పంగా ప‌డిపోయిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా..

-

నిన్న ఒక్క‌సారిగా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,860 రూపాయల వద్దకు చేరింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయలు తగ్గి 36,540 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 950 రూపాయలు తగ్గి 46,900 రూపాయలకు దిగివచ్చింది.

ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు స్వల్పంగా తరుగుదల నమోదు చేశాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గి 38,500 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తరుగుదల నమోదు చేసి 37,300 రూపాయలైంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 950 రూపాయలు తగ్గింది. దీంతో 46,900 రూపాయలకు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news