వేసవిలో ఈ ఆహారం తీసుకుంటే మంచిది…!

-

వేసవి లో తేలికగా మరియు ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని కారణంగా మీరు ఎప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చల్లగా ఉండే ఆహారం తీసుకోవడం చేయాలి.

లైట్ గా ఉండే ఆహారం తీసుకోవాలి అంటే తక్కువగా తీసుకోవడం కాదు. సులువుగా అరుగుదల అయిపోయే ఆహారం తీసుకోవాలని అర్థం. అయితే ఇక్కడ కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని వేసవిలో తీసుకుంటే లైట్ గా ఉంటాయి మరియు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం..!

సలాడ్ :

తాజా కూరగాయలతో చేసిన సలాడ్ తీసుకోవడం తేలికగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. వేసవిలో ఇది మంచి ఆహార పదార్థము.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి వేసవిలో చెమట ఎక్కువగా పట్టి ఫ్లూయిడ్స్ తొలగి పోతుంటాయి. కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల తిరిగి ఫ్లూయిడ్స్ అందుతాయి. కాబట్టి వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండండి.

పుచ్చకాయ జ్యూస్:

వేసవిలో పుచ్చకాయలు బాగా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటితో జ్యూస్ చేసుకుని తీసుకోవచ్చు. దానిలో కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేసవిలో తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్.

ఐస్డ్ టీ:

ఐస్డ్ టీ కూడా సమ్మర్ లో తీసుకోవడానికి బాగుంటుంది. పైగా సులువుగా మనం చేసుకోవచ్చు. దీనిలో పుదీనా, తులసి ఆకులు, నిమ్మకాయ మరియు కొబ్బరి నీళ్ళు కూడా వేసి కూడా చేసుకోవచ్చు. దీని వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్ లో ముఖ్యమైన న్యూట్రియన్స్ ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, ఐయోడిన్ ఇందులో ఉంటాయి. పైగా దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బెర్రీస్ లాంటివి ఫ్రూట్స్ తో మీరు దీనిని తీసుకోవచ్చు. ఇది బాడీని కూల్ చేస్తుంది మరియు డైజెస్టివ్ సిస్టమ్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బియ్యం నీళ్లు:

చాలా మందికి బియ్యం నీళ్ళు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియదు. ఆ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆ నీటిలో కొద్దిగా పెరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని తీసుకోవచ్చు ఇది చల్లదనాన్ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news