కొండపోచమ్మ గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేసిన కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ కొండపోచమ్మ నుండి గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేశారు. ఉదయం 10.30కు వర్గల్‌ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేసిన అనంతరం 11.15కి మర్కూక్‌ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు.

కొండపోచమ్మ గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేసిన కేసీఆర్‌

కొండపోచమ్మ సాగర్‌ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. ఇక ఈ గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాం సాగర్‌ చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్‌ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్‌ డ్యామ్‌లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్‌లోకి చేరుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news