జగన్ ఇచ్చే 10 వేలు రాలేదా.. ఇలా చేయండి..!

-

కరోనా వైరస్ కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన చిరు వ్యాపారులను ఆదుకునే విధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు అనే ఓ సరికొత్త పథకానికి నేడు ఊపిరిపోసింది అన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుపోయిన వారికి చేయూత అందించే విధంగా ఎలాంటి వడ్డీ లేకుండానే పదివేల రుణాలు అందించేందుకు సిద్ధమైంది రాష్ట్రప్రభుత్వం. ఈరోజు ఉదయం ఈ పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్.

అయితే లబ్ధిదారులు అయ్యుండి ఈ పథకంలో భాగంగా పది వేల రూపాయల రుణం పొందని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వెంటనే వార్డు లేదా సచివాలయం లోకి వెళ్లి మీ పత్రాలను పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాలి. తద్వారా మీ పత్రాలను పరిశీలించిన తర్వాత మీరు ఈ పథకానికి అర్హుల కాదా అన్న విషయాన్ని నెలరోజుల లోపు తేల్చి ఈ పథకం యొక్క అర్హుల జాబితా లో మీ పేరు చేరుస్తారు. లేదా 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news