ఈ ఆయుర్వేద టిప్స్ ని పాటిస్తే కంటికి మంచిది..!

-

కరోనా మహమ్మారి మొదలైన దగ్గర నుండి చాలా వరకు వర్క్ ఫ్రొం హోమ్ మరియు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. దాంతో ఎక్కువ సేపు స్క్రీన్ ముందే ఉండాల్సి వస్తోంది. అందువలన కంటికి సంబంధించిన సమస్యలు చాలా వస్తున్నాయి.

గత కొన్ని నెలల నుండి లాప్టాప్ మరియు మొబైల్ స్క్రీన్స్ ముందు ఎక్కువ సేపు సమయాన్ని గడపడం వల్ల కంటి చూపు రోజు రోజుకీ బలహీనంగా మారుతోంది. ఎక్కువ సేపు స్క్రీన్ ముందు ఉండడం వల్ల కంటి పై ఒత్తిడి ఎక్కువై తలనొప్పి, డార్క్ సర్కిల్స్, కళ్ళు మంటలు మరియు కళ్ళు పొడిబారడం వంటి కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారు.

మన కంటి చూపుని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని ఆయుర్వేద చిట్కాలను మనతో పంచుకున్నారు. ఈ ఆయుర్వేదిక్ చిట్కాలను పాటించడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మీ నోటిని నీరుతో నింపుకొని కొన్ని సెకండ్లు కళ్ళు మూసుకుని ఉండండి. ఆ తర్వాత నీటిని ఉమ్మేయండి. ఇదే ప్రక్రియను రెండు నుండి మూడు సార్లు వరకు చేయండి.

ఎప్పుడూ కూడా బాగా వేడి లేదా బాగా చల్లని నీరు కంటి పై ఉపయోగించకూడదు.

మీకు బాగా వేడిగా అనిపించినప్పుడు వెంటనే చల్లని నీటితో ముఖం కడుక్కోకూడదు. పది నుండి పదిహేను నిమిషాల వరకు వేచి ఉండండి. మీ శరీర ఉష్ణోగ్రత అడ్జస్ట్ అయ్యే వరకు ఉండి ఆ తర్వాతనే ముఖం కడుక్కోండి.

మీ కళ్ళు మరియు ముఖాన్ని నార్మల్ వాటర్ తో 10 నుండి 15 సార్లు కడుక్కోండి. మీ వర్క్ నుండి వచ్చిన తర్వాత ఇలా చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది.

త్రిఫల నీరుతో కళ్ళను ప్రతిరోజు కడుక్కోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

అంజనా ఆయుర్వేదం కి సంబంధించిన మిశ్రమంతో కంటిరెప్పల లోపల భాగం పై అప్లై చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇలా ఈ టిప్స్ ని ఫాలో అవ్వడం వలన సమస్యలు తగ్గుతాయి. అలానే కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news