ఆదివారం హైదరాబాద్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనతో సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అయితే ఏపీ సర్కార్ నూతనంగా జారీ చేసిన జీవో నెంబర్ 1, పెన్షన్ లబ్ధిదారుల కోత, పాడి రైతులకు గిట్టుబాటు ధర వంటి అంశాలపై చర్చించినట్లు ఇరువురు నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జెన్సీ కంటే దారుణ పరిస్థితి ఉందని ఆరోపించారు.
అయితే వీరి భేటీ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి విడదల రజిని. కందుకూరు, గుంటూరులో చోటుచేసుకున్న తొక్కి చలాట ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించకుండా.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని పరామర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీరి ఇద్దరి పేర్లు మాత్రమే వేరని.. ఇద్దరూ ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలసి వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ వెంటే ఉంటారని అన్నారు.