హిట్ 2 :థియేటర్ లోనే కాదు,ఓటిటిలో కూడా సూపర్ హిట్!

-

తెలుగులో మంచి హీరోలలో అడవి శేష్ ఒకరు. తాను సినిమా కోసం తన ప్రాణం పెట్టి మరీ పనిచేస్తాడు. మహేష్ బాబు, నమ్రత నిర్మించిన మేజర్ సినిమా తనను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఉత్తరాది ప్రేక్షకులు తనని విపరీతంగా అభిమానిస్తున్నారు. ఇక రీసెంట్ గా కూడా  అడవిశేష్  హిట్ కొట్టాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 2 లో అతను పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా  అదరగొట్టాడు

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాలు తో పాటు , అమెరికా లో కూడా మంచి వసూళ్లు సాధించింది.   ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మంచి వ్యూస్ తో నడుస్తోంది.ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో టాప్ లో ట్రెండింగ్‌లో ఉంది.

దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు ద్వారా హిట్ 2, సినిమా ప్రస్తుతం మూవీస్ విభాగంలో 1వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉందని ప్రకటించాడు. దీనితో అడివి శేష్ మరియు అతని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.ఇక హిట్ 3 కోసం ఈ సారి నేచురల్ స్టార్ నాని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఈ సినిమా చివర్లో చూపించారు. చూస్తూంటే ఈ హిట్ సిరీస్ లో టాలివుడ్ హీరోస్ అందరూ నటించేలా కనిపిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news