పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు భరోసా వేయనందుకు రైతులు కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ… ”అనేక హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. నెలకు రూ. 2500 ఇవ్వలేదని కాంగ్రెస్‌పై మహిళలు కోపంతో ఉన్నారు. బీజేపీపై కూడా ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచారని ప్రధాని నరేంద్ర మోడీపై కోపంతో ఉన్నారు. రెండు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ ముచ్చెమటలు పట్టించింది. మూడు పార్టీల్లో మా పార్టీకే అధిక ఎంపీ సీట్లు వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు.ఢీల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపి-కాంగ్రెస్ వ్యవహారం ఉంది అని విమర్శించారు. ఆరేడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపికు సహకరించారు. కేంద్రంలోనూ ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చే పరిస్థితి లేదు అని అన్నారు. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమిదే కేంద్రంలో అధికారం’ అని కేటీఆర్ అన్నారు