ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారం నాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై ఆప్ నేతలు స్పందించారు.ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ పరిగణనలోకి తీసుకున్నారని, ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటారని మంగళవారంనాడు తెలిపారు.
సీఎం వ్యక్తిగత సహాయకుడు వైభవ్ కుమార్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై దాడి జరిపాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమె ఫిర్యాదు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీనిపై 3 రోజుల్లాగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించగా, ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను నివాసంలోని డ్రాయింగ్ రూమ్ వద్ద స్వాతి మలివాల్ వేచి ఉన్నప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుందని, ముఖ్యమంత్రి సహాయకుడు వైభవ్ కుమార్ అనుచితంగా ప్రవర్తించినట్టు గుర్తించామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. సీఎం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నానని, తగిన చర్యలు తీసుకోనున్నారని ఆయన తెలిపారు.