హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ఎంత రస వత్తరంగా సాగిందో అదే తరహా లో నే ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఉపఎన్నిక కౌంటింగ్… ప్రారంభం అయినప్పటి నుంచి… 13 రౌండ్ల వరకు ఉత్కంఠ భరితంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోస్టల్ బ్యాలెట్, ఎనిమిదో రౌండ్, 11 వ రౌండ్ మినహా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది.
ఇది ఇలా ఉండగా 14 వ రౌండ్ లో 1046 ఓట్ల ఆధిక్యం సంపాదించింది బీజేపీ పార్టీ. దీంతో 14 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ పార్టీ కి ఓవరాల్ గా 9,434 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఇక 14 రౌండ్ల ఫలితాలు వెలువడే సరికి బీజేపీ పార్టీ కి 63,079 ఓట్లు పోల్ కాగా , టీఆర్ఎస్ పార్టీ కి మాత్రం 53,627 ఓట్లు వచ్చాయి. ఇక అటు టిఆర్ఎస్ పార్టీ కంచు కోట గా ఉన్న గ్రామాల్లోనూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కే ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయి. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గేళ్లు శ్రీనివాస్ గ్రామంలో కూడా బిజేపి కే లీడ్ వచ్చింది.