ఐటీ రిటర్నులకు జులై 31 తుది గడువు.. రికార్డు స్థాయిలో ఐటీ రిటర్నులు

-

ఇన్‌కం టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చెయ్యడానికి చివరి రోజు జులై 31. అంటే.. ఇంకా ఆదివారం, సోమవారం మాత్రమే టైమ్ ఉంది. చివరి రోజుల్లో ఫైల్ చెయ్యాలంటే.. సర్వర్ బిజీ అయ్యి… ఫైల్ చెయ్యడం కష్టం కావచ్చు. అందువల్ల ఇప్పటికే చాలా మంది ఫైల్ చేసేశారు. కానీ ఇంకా చాలా మంది చెయ్యలేకపోయారు. వారంతా.. గడువు పెంచాలని కోరుతున్నారు. మరో వారం టైమ్ ఇవ్వాలి అంటున్నారు. భారత్ లో ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేయగా…. ఈ ఏడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్ లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు రేపు (జులై 31) తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలయ్యే అవకాశాలున్నాయి.

How to File Income Tax Return (ITR) for Last Years

ఇవాళ ఒక్కరోజే భారీ సంఖ్యలో ఐటీఆర్ లు దాఖలయ్యాయి. చివరి ఒక్క గంట వ్యవధిలోనే 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐటీ విభాగం పోర్టల్ లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, ఇవాళ కూడా అదే ఒరవడి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10.39 లక్షల ఐటీఆర్ లు దాఖలయ్యాయి. ఇంకా 2 కోట్ల మందికి పైగా ఐటీఆర్ లు దాఖలు చేయాల్సి ఉండగా, రేపు చివరి రోజున ఐటీ విభాగం పోర్టల్ కు పోటెత్తే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా, జులై 31 తర్వాత రిటర్నుల దాఖలుకు జరిమానాతో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news