వివాహానికి సిద్ధమైన జబర్దస్త్ జంట.. ఎవరంటే..?

-

జబర్దస్త్ స్టేజ్ పై ఎంతోమంది కమెడియన్లు ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వగా మరికొంతమంది బుల్లితెరపై కనిపిస్తూ ఉన్నారు. అలాంటి కమెడియన్లలో లేడీ కమెడియన్ పవిత్ర కూడా ఒకరు. జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొని తన హవా కొనసాగిస్తూ ఉంటుంది పవిత్ర. ముఖ్యంగా లేడీ కమెడియన్లలో ఫైమా, రోహిణి ,వర్ష తర్వాత పవిత్ర ఉన్నదని చెప్పవచ్చు. బుల్లితెరపై అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. కేవలం బుల్లితెర పైనే కాకుండా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వారి యొక్క విషయాలను తెలియజేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా పవిత్ర పెళ్లి చేసుకోబోతోంది అనే విషయం వైరల్ గా మారుతోంది. జబర్దస్త్ స్టేజ్ పైన పవిత్ర, తేజ వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ ఇప్పుడు మా పెళ్లి షాపింగ్ అంటూ ఒక వీడియోని షేర్ చేయడంతో నేటిజన్ల సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మా పెళ్లి షాపింగ్ అంటూ ఒక హెడ్డింగ్ పెట్టి జబర్దస్త్ తేజ తో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోలో పవిత్ర కనిపించింది.

మా ఇద్దరికీ పెళ్లి కుదిరింది. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాము అందుకోసమే పెళ్లి చీరలు కోసం షాపింగ్ కి వచ్చామంటూ తేజ చెప్పుకొచ్చారు. కానీ పవిత్ర మాత్రం ఊరికే అంటూ సైగలు చేసింది. ఇక ఈ వీడియోలో వీరిద్దరి మధ్య పంచు డైలాగులు నేటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.అయితే ఇదంతా కేవలం జబర్దస్త్ లో ఒక పెళ్లి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version