Jabardast: జబర్దస్త్ జడ్జ్ ల పారితోషకం ఎంతో తెలిస్తే షాక్..!

-

బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ముఖ్యంగా జబర్దస్త్ కి ప్రేక్షకులలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది అనడంలో సందేహం లేదు. ఎంతోమంది కమెడియన్స్ తమ అద్భుతమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మరింత ఆనందాన్ని అందిస్తున్నారు. ఒక షో కి కమెడియన్ ల పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. జడ్జిల పాత్రల ప్రాధాన్యత కూడాఅంతకుమించి ఉంటుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని జబర్దస్త్ వేదికపై ఇప్పటివరకు పనిచేసిన జడ్జిల పారితోషకం ఎంతో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

రోజా:
2009లో మల్లెమాల యూనిట్.. జబర్దస్త్ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు మొదటి జడ్జిగా రోజా అడుగుపెట్టింది . అప్పట్లోనే రూ.2 లక్షల పారితోషకం తీసుకున్నారు.. ఆ తర్వాత కాలంలో ఎపిసోడ్ కు రూ.4 లక్షల వారితోషకం తీసుకునే రేంజ్ వరకు వెళ్ళింది. అయితే ఇప్పుడు రాజకీయాలలో కీలక పదవి దక్కడంతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది రోజా.

నాగబాబు:
ప్రముఖ నటుడు నాగబాబు కూడా రోజాతో పాటు జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించారు. అయితే ఆయన క్రేజ్ ని బట్టి ఆయనకురూ. 1.50 లక్షలు పారితోషకం ఇచ్చేవారు.

ఇంద్రజ:
ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమాలలో పర్మినెంట్ జడ్జిగా మారింది. అంతేకాదు మల్లెమాల షోలకి కూడా ఆమె పర్మినెంట్ జడ్జ్ అయిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె కూడా రోజా స్థాయిలో పారితోషకం తీసుకుంటుందని తెలుస్తోంది.

ఖుష్బూ:
అప్పుడప్పుడు జబర్దస్త్ వేదికపై కనిపిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న కుష్బూ షో కి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆమెకి కూడా భారీ పారితోషకం ఇవ్వడం గమనార్హం. ఆమె కూడా సుమారుగా ఎపిసోడ్ కి 2 లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

కృష్ణ భగవాన్:
ఒకప్పుడు కమెడియన్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన కృష్ణ భగవాన్ ఇప్పుడు జబర్దస్త్ వేదికపై జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ భగవాను కూడా రూ.2 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news