పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు.. వివరాలివే..!

-

కొత్త సంవత్సరం మొదటి రోజే గ్యాస్ ధరల్ని పెంచారు. గత ఏడాది చివర్లో వరుసగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు మళ్ళీ ఇప్పుడు పెరగనున్నాయి. డిసెంబర్ నెల లో గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చెయ్యలేదు. దాని కంటే ముందు వరుసగా ఐదు నెలలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్ని తగ్గించేశారు. కానీ కొత్త సంవత్సరం మొదటి రోజే అందరికీ పెద్ద షాక్ ఎదురైంది.

జూన్ నుంచి ఏకంగా ఏడు సార్లు రేట్లు ని తగ్గించారు కానీ ఆయిల్ కంపెనీలు ఇప్పుడు వీటిని మళ్ళీ పెంచాయి. కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఇక ధరల విషయానికి వస్తే.. గ్యాస్ సిలిండర్‌పై రూ.25 రూపాయల మేర ఇప్పుడూ పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లోని ఈ మార్పు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఏ మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు మాత్రం డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయదు.

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.25 మేర పెరగడంతో రూ.1769కి చేరింది. ముంబై లో అయితే రూ. 1721కి, కోల్‌కతాలో రూ.1870 వద్ద వుంది. చెన్నై లో రూ.1917 వద్ద ఉంది. అదే హైదరాబాద్‌లో అయితే రూ.1973కు పెరిగింది. వరంగల్‌లో ఇది రూ.2014, కరీంనగర్‌లో రూ.2016.50 వద్దకు చేరింది. విశాఖపట్టణంలో రూ.1819 రూపాయలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news