జబర్దస్త్ లోకి కొత్త టీమ్ లీడర్.. ఆది కి చుక్కలే..!

-

ప్రముఖ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఎంతో మందికి అవకాశాలను ఇస్తూ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది. ముఖ్యంగా చాలామంది తమ టాలెంటును నిరూపించుకోవడానికి అద్భుతమైన వేదిక జబర్దస్త్ అని చెప్పవచ్చు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకొని సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో వచ్చిన పటాస్ కార్యక్రమం ద్వారా కూడా చాలామంది కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

కమెడియన్లుగా రాణిస్తున్న యాదమ్మ రాజు, సద్దాం వంటి వారు పటాస్ కార్యక్రమం ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ షోలో తన పంచులు, కామెడీ టైమింగ్ తో అలరించిన సద్దాం అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడ తెచ్చుకున్న గుర్తింపు ద్వారా వేరే చానల్స్ లో కూడా కమెడియన్ గా అవకాశాలు దక్కించుకున్నాడు. అందులో భాగంగా అదిరింది, కామెడీ ధమాకా , కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలలో కూడా సందడి చేశారు సద్దాం. అయితే ఇప్పుడు జబర్దస్త్ లో హైపర్ ఆదికి పోటీ ఇవ్వడానికి జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే అది కూడా టీం లీడర్ గా రాబోతున్నట్లు సమాచారం.

డిసెంబర్ 22న ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. సద్దాం న్యూ టీం లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. సూపర్ సద్దాం.. యాదమ్మ రాజు.. షైనింగ్ శాంతి కుమార్ లతో కలిసి స్కిట్ చేయనున్నాడు సద్దాం. మొత్తానికి పంచులకే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆదికి తన సరికొత్త పంచులతో చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యాడు సద్దాం. మరి ఇద్దరిలో ఎవరు పాపులారిటీ అవుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news