తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

-

తెలంగాణలో గ్రూప్-2,3 ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని పోస్టులను చేర్చడంతో తాజాగా వాటి సంఖ్య మరోమారు పెరగనుంది. దాదాపు 120 వరకు కొత్తగా పోస్టులు కలపడంతో గ్రూప్ 2 కింద మొత్తం 783 పోస్టులకు ప్రకటన వెలవడం ఉంది. అటు గ్రూప్ 3 లో కూడా కొత్తగా పోస్టులను చేర్చనున్నారు.

ఇప్పటికే గ్రూప్-2 కింద 663, గ్రూప్-3 కింద 1,373 పోస్టులను గుర్తించిన కమిషన్, అదనంగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. గ్రూప్-2 కింద సంక్షేమ శాఖలో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 43 వరకు, శిశు సంక్షేమ శాఖలో 11 జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కలిపి మొత్తం 100 వరకు పోస్టులు పెరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news