Breaking : చైనాలో ఒక్కసారిగా కరోనా విజృంభణ

-

చైనాలో ఒక్కసారిగా కరోనా విజృంభణ పూర్తికాకముందే ఒక్కసారిగా మహమ్మారి ఉద్ధృతి పెరిగింది. ఒమిక్రాన్ వైరస్ రకం శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనాలో కరోనా నిబంధనలు సడలించి 15రోజులు రాజధాని బీజింగ్తో పాటు పలు నగరాల్లో ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలాచోట్ల గంటల తరబడి రోగులు నిరీక్షిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు.

China's Looming 'Tsunami' of Covid Cases Will Test Its Hospitals - The New  York Times

జీరో కొవిడ్ విధానంతో చైనా కష్టాలను కొనితెచ్చుకుంటోంది. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 10 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో లక్షలాది కేసులు వచ్చే ముప్పు ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకినా చాలా మంది లక్షణాలు కనపడడం లేదు. ఆసుపత్రిలో పడకలు ఐసీయూల సంఖ్య పెంపుపై చైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలను చైనా ఇంటికే పరిమితం చేసింది. అయినప్పటికీ, చైనాలో కరోనా కేసుల విజృంభణ ఆగడం లేదు. కొన్ని వేల మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారని, అయితే, కరోనా సోకి బయటపడని వారు కూడా వేలల్లో ఉండొచ్చని వైద్యులు అంటున్నారు.

చైనాలోని అనేక ప్రాంతాల్లో విద్యాలయాలు, రెస్టారెంట్లకు సెలవులు ఇచ్చారు. షాంగ్సీ ప్రావిన్స్ లో కరోనా రోగుల కోసం 22,000 బెడ్లను సిద్ధం చేశారు. ఐసీయూ సామర్థ్యాన్ని 20 శాతం పెంచారు. ప్రపంచ దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నించగా, చైనా మాత్రం మొదటి నుంచి జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది. కఠిన ఆంక్షలు పెడుతున్నప్పటికీ కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news