ఈటలపై జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు… బిజేపితో పాటు మునిగిపోతాడు

-

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈటల ఇప్పడు టిఆర్ఎస్ ను విమర్శించడం తెలివితక్కువ తనమని..బీజేపీలో చేరిన ఈటల టిఆర్ఎస్ ను , కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని ఫైర్ అయ్యారు. మునిగిపోతున్న బీజేపీతో పాటు ఈటల మునిగిపోతారని జోస్యం చెప్పారు. ఆయన నమ్మి వెంట వెళ్లిన వారు మునిగిపోతారనీ.. 70 ఏళ్లలో సాధించని అభివృద్ధి ఏడేళ్లలో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధించిందన్నారు. ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదమని..ఈటల హిట్లర్ వారసుల వద్ద చేరి నియంతృత్వముపై పోరాడతా అంటున్నారని చురకలు అంటించారు. ఈటల ముందే ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుందనీ..ఈటల ఇంతకాలం చెప్పిన మాటలకు…చేతలకు పొంతన లేదని పేర్కోన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తీసుకువచ్చిందనీ…ఇవి నల్ల చట్టాలు… రైతులను నడ్డివిరిచే చట్టాలు అని ఈటల అన్నారనీ గుర్తు చేసారు. ఈటల బీజేపీలో చేరి ప్రజలకు ఏ న్యాయం చేస్తారో చెప్పాలనీ..ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారని ఏద్దేవా చేశారు. దేశం అంత బీజేపీని విలన్ గా చూస్తోందనీ..మోడీ ప్రభుత్వం బడుగు,బలహీన వర్గాల కోసం ఒక్క కొత్త పథకం అయిన తీసుకువచ్చిందా ? అని ప్రశ్నించారు. బీజేపీలో చేరడం ద్వారా తెలంగాణ,హుజురాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news