తన స్వార్ధ రాజకీయాలకోసం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా. గతంలో చంద్రబాబు హయాంలో తన వర్గ ప్రజల కోసం అమరావతి ప్రాంతం రాజధానిగా గుర్తించి దాన్ని ప్రకటించక ముందు తన వారి చేత అక్కడ ఉన్న భూములను అన్నింటిని కొనుగోలు చేపించి అధికార దుర్వినియోగం చేసి వ్యవహరిస్తున్న తరుణంలో ప్రస్తుతం అధికారంలో జరగనుండటంతో విషయం మొత్తం బయట పడటంతో ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా డైలమాలో పడిపోయారు చంద్రబాబు.
ఇటువంటి తరుణంలో అమరావతి లో ఉన్న రైతులు చంద్రబాబుపై తిరగబడే విధంగా అసెంబ్లీ సాక్షిగా సూపర్ స్కెచ్ వేశారు సీఎం జగన్. రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ఆందోళన చేస్తున్న రైతులకు ఉపశమనం కలిగేట్లుగా కౌలు కాలపరిమితిని పదేళ్ళ నుండి 15 సంవత్సరాలకు పెంచాలని డిసైడ్ చేసింది. అలాగే సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా నిర్ణయించింది.
అలాగే పరిపాలన వికేంద్రీకరణ రాష్ట్రాభివృద్ధి చట్టం-2020కి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్తతో విచారణ జరిపించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో జగన్ ప్రకటనతో ఫుల్ హ్యాపీగా ఉన్న అమరావతి రైతులు అదే సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా జగన్ సర్కార్ రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన భూ దందా ని బయటపెట్టడంతో తమను అడ్డంపెట్టుకుని రాజకీయ క్రీడా చేస్తున్న చంద్రబాబుపై తిరగ పడటానికి అమరావతి రైతులు రెడీ అవుతున్నట్లు సమాచారం.