హిందువునని చెప్పుకోవడానికి సీఎంకి సిగ్గుండాలి..

గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితం రిపీట్ కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
ఒకప్పుడు పాస్ పోర్ట్ బ్రోకర్ మన ముఖ్యమంత్రి గా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. బీసీ పక్షపాతి వి అయితే పార్టీ అధ్యక్షుడు గా బీసీ ని చేయి అని కేసీఆర్ సవాల్ విసిరారు బండి సంజయ్. 2bhk అంటే దో బెట, హరీష్ రావు, కవిత సెటైర్లు వేశారు. బీసీ మంత్రుల పై కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. బీసీ మంత్రులు ముఖ్యమంత్రికి చెంచాగిరి చేస్తున్నారని అన్ని కుల సంఘాలు బీసీ సమస్యలను పక్కన పెట్టి సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు.


ముస్లిం లనుబీసీ లుగా గుర్తించడం 50డివిజన్ లలో హిందు బీసీ లు గెలవాల్సిన చోట తో 22 స్థానాల్లో ముస్లిం లు గెలిచారు బీసీ నాయకులు సిగ్గు తో తలదించుకోవాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తాడట… ఇక ఒక్క సీటు కూడా బీసీ కి ఉండదు బీసీ కుల వృత్తులను ముస్లింలు కబ్జా చేసారు అని ఫైరయ్యాడు సంజయ్. మైనార్టీ సంతుష్టికరణ కోసం హిందువుల పొట్ట కొడితే సహించం హిందువునని చెప్పుకోవడానికి సీఎం కి సిగ్గు ఉండాలన్నారు. అగ్ర వర్ణ పేదలకు కేంద్రం 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సీఎం ఇక్కడ అమలు చేయడం లేదని హిందు వ్యతిరేక విధానాలను బీజేపీ అడ్డుకొని తీరుతుందన్నారు. వంద సీట్లు గ్రేటర్ హైదరాబాద్ గడ్డ మీద బీజేపీ గెలిస్తే దగుల్బాజీ, దగాకోరు ముఖ్యమంత్రికి తగిన జవాబు చెప్పోచ్చన్నారు.